తెలంగాణ రాష్ట్ర ఆరెస్సెస్ కార్యాలయం, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర సమావేశంలో గజ్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ ఆకుల నరేశ్ బాబును సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నరేశ్ బాబు మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ గురుతర బాధ్యత అప్పగించినందుకు సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాం ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, అప్పాల ప్రసాద్, మరియు రాష్ట్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు.
