24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16)
స్వచ్ఛంద పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎం ప్రకాష్ రావును గజ్వేల్ మహతి ఆడిటోరియంలో ఆదివారం సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పాములపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువు ప్రకాష్ రావు అంటే మాకు ఎంతో అభిమానం అని,2002-2003 పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ప్రకాష్ రావుకు శాలువాతో సత్కరించి చిత్ర పటాన్ని అందజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శివ కుమార్,రాజు,లక్ష్మి రెడ్డి, సీనియర్ నాగారాణి తదితరులు పాల్గొన్నారు.





