24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ (ఏప్రిల్ 18)
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు తెలంగాణ భవన్ లో గురువారం బీ ఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ,బొమ్మెర రాంమూర్తి,రాజు గౌడ్ తదితరులు ఉన్నారు.
