రాజకీయం

గజ్వేల్ ప్రజలకు అందుబాటులో మల్టీస్పెషల్టి హాస్పిటల్

72 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 16)

:- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం సంగాపూర్ రోడ్ లో ‌పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను పల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు, ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి హాస్పిటల్ యాజమాన్యం పూల బొకేలతో, శాలువతో సన్మానించారు, అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలు ఇలా అన్ని సౌకర్యాలు ఉండే మంచి వైద్య నిపుణులు కలిగిన హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు, ప్రజలకు మంచి వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు, ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండి పేద ప్రజలకు సేవలు అందించాలిఅని అన్నారు, మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం హర్షించదగ్గ విషయమని వారన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ పంగ మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, స్థానిక కౌన్సిలర్ గుంటుకు రాజు, స్థానిక డాక్టర్లు డా, ఎలిశాల లింగం, డా, కొలిచెలిమి మహిపాల్, డా, మల్లయ్య, హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ తుషార్, డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రీనాథ్ ,డాక్టర్ నవీన్ రావు ,డాక్టర్ అలీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మోహన్ బాబు, శ్రావణ్ ,వెంకట్ గౌడ్ హాస్పిటల్ స్టాఫ్ తదితర సిబ్బంది, లోకల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్