(మానకొండూరు జూన్ 14)
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన దాసరి కళ్యాణి ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 1060 ర్యాంకు సాధించారు.
దాసరి కళ్యాణి తండ్రి దాసరి అంజయ్య జర్నలిస్టు గా,అన్నయ్య ప్రశాంత్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ లేకుండా రాష్ట్రస్థాయిలో ఈ ర్యాంకు సాధించడం నాకు చాలా సంతోషంగా ఉందని దాసరి కళ్యాణి తెలిపారు..
న్యాయ శాస్త్రం పట్ల మక్కువతో ప్రభుత్వ మోడల్ స్కూల్ లో నేను పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పోచంపల్లి లోని ఆదర్శ పాఠశాల/ కళాశాలలో పూర్తి అయిన వెంటనే లాసెట్ రాయడం జరిగిందని అన్నారు..
ఈ ర్యాంకు సాధించినందుకు గ్రామస్తులు, కళాశాల యాజమాన్యం తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.




