మునిగడప ఆంజనేయులు కుటుంబానికి బీఎస్పీ నాయకుల చేయూత
సిద్దిపేట్ జిల్లా జూన్ 14
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ వారం రోజుల క్రితం ఇంట్లో నుండి కనిపించకుండా పోయి అదే పాములపర్తి గ్రామంలోని పెద్ద చెరువులో శవమై కనిపించి కుటుంబస్తులకు,గ్రామస్థులకు బాధను మిగిలించి వెళ్లిన మునిగడప ఆంజనేయులు కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తమ వంతు సహాయంగా 50 కేజీల బియ్యం కొండనోళ్ళ నరేష్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
పార్టీ నాయకులు శరదని రాము, రాజంగారి భాను,మునిగడప మల్లేష్, అక్కరం శేఖర్,కొండనోళ్ళ వంశి,కరుణాకర్,భాను,చంద్రం,మహేష్ మరియు గ్రామస్థులు గిద్దెల భిక్షపతి,యాదగిరి,అనిల్ నరేష్, యాదయ్య పలువురు పాల్గొన్నారు
