ప్రాంతీయం

రాజీయే రాజమార్గము

62 Views

రాజీయే రాజమార్గము

జాతీయ లోక్ అదాలత్ లో 2064 కేసులు పరిష్కారం

మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపల్ ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి. ప్రియాంక

జూన్ 9 ( సిద్దిపేట జిల్లా )

గజ్వేల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన క్రీమినల్ కేసులు బ్యాంక్ కేసులు అన్ని కలిపి దాదాపు 2064 కేసులు పరిష్కారం జరిగినవని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపల్ ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ప్రియాంక తెలిపారు ఈ సందర్బంగా  మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని చిన్న చిన్న సమస్యలతో కక్షలు పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడం మార్గమని, లోక్‌అదాలత్‌ ఎంతో ప్రయోజనకరమని చెప్పారు.

లోక్‌ అదాలత్‌ లో వెలువరించిన తీర్పు తుది తీర్పు అన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొంది సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు క్షణికావేశంలో చిన్న తప్పులు చేసి అనవసరంగా భవిష్యత్తును పాడు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల చిన్న చిన్న కేసులు సులభంగా పరిష్కరించవచ్చని చెప్పారు. పోలీసు, రవాణా, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ అధికారులు సహకరించడం ద్వారా అనేక కేసులు సులభంగా పరిష్కారమవుతాయని చెప్పారు లోక్‌అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు .పాండరి , న్యాయవాదులు, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిని నర్సింహులు మండల్ లీగల్ సర్వీస్ సిబ్బంది నరసింహ్మాచారి, యామిని కోర్టు సిభ్భంది పోలీసు సిబ్బంది వివిద బ్యాంక సిబ్బంది తదీతరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్