ఆరోగ్యవంతమైన జీవని విధానంను పాటించడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 6,
ఆరోగ్యవంతమైన జీవని విధానంను పాటించడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నేటి నుండి వారం రోజుల పాటు నిర్వహించనున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే కార్యక్రమం నిర్వహించి ఈట్ రైట్ అనే నినాదంతో ఆరోగ్యవంతమైన ఆహారం తినడంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను సందర్శించి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా మార్చి మొదటివారం పరిశుభ్రత, పచ్చదనంపై కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఏప్రిల్ 2 వ తేదీన గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభలు నిర్వహించడం జరిగిందని, మార్చి 16న మండల సభ, తర్వాత నియోజకవర్గం స్థాయి సభ, జిల్లా స్థాయి సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఒక్కో వారం ఒక్కో థీమ్ తో ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దాన్లో భాగంగాఈ వారం ఆరోగ్యం అంశంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ డే నిర్వహించి అవగాహన కల్పించాలనీ లక్ష్యమని తెలిపారు.ఆహారమే ఆరోగ్యం కాబట్టి అందరూ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రాచీన కాలం నుండి భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం ముఖ్య పాత్రను పోషించిందని ఇతర వైద్యవిధానంతో పాటు ఆయుర్వేద పద్ధతులను ఆలంబించాలని అన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం పై అందరికీ అవగాహ అవుసరం.వైద్యం కొరకు ఆయుష్ మెడిసిన్ ను కూడా ఉపయోగించాలని. మందులను కూడా ఇష్టం వచ్చినట్టు వాడరాదు. డాక్టర్లు చూసించినవే వాడాలని. వయస్సువారిగా ఆహారం మోతాదులో తినాలనీ. ప్రకృతికి దగ్గరగా మన ఆహార అలవాట్లు ఉండాలన్నారు. మన శరీరంలోనే వ్యాధులను ఎదుర్కునే సహజత్వం ఉంటుందనీ, మన ప్రాంతంలో పండే సహజమైన తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినాలని. మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పునీటితో కడుగాలని. జంక్ ఫుడ్స్ తినొద్దనీ సూచించారు. ఈ హెల్త్ విక్ లో అవగాహ పెంచుకొని, మితాహారం, పౌష్టికాహారం తీసుకోవాలనీ. యోగ, వ్యాయామం చేయాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ధన్ రాజ్ మాట్లడుతూ.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం మూలంగా దేశవ్యాప్తంగా 50% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి మహిళ తప్పనిసరిగా హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలనీ, ఆరోగ్యవంతమైన ఆహారం భుజించాలని. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలన్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్యమహిలా ఆరోగ్యకేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించే వైద్యపరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను వాడాలన్నారు.డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ..అధికంగా ఉప్పు, నూనె, చెక్కర తినడం వలన ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్ వ్యాధులు వస్తున్నాయని , జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండి సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలని, ఏదైనా తినుబండారాలు తీసుకున్నప్పుడు వాటిపై ఎక్స్పైరీ డేటును చూడాలని అన్నారు.జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ… నేటి కిషోరబాలికలే రేపటి మహిళలు కాబట్టి ఈ వయస్సులో మంచి ఆహారం తీసుకుంటే భవిష్యత్తులో తల్లులుగా బలంగా తయారవుతారని అన్నారు. చిన్నారులను, గర్భిణులను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించి పౌష్టికాహారం పొందేలా అందరూ చూడాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ .. మా కాలేజ్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం వలన విద్యార్థులు ఆరోగ్యవంతమైన గురించి తెలుసుకొని ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఎదగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్యారోగ్య శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఈ ఈట్ రైట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, వైద్య సిబ్బందికి బహుమతులను అందజేశారు
.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





