ఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 5:
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని దూషించి నందుకు కేసు నమోదు చేయాలని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని అనడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణను సాధించుకోవడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినవారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సద్ది లక్ష్మ రెడ్డి, నాయకులు రాజేందర్, కొత్తపల్లి దేవయ్య, చెన్ని బాబు, బానోతు రాజు నాయక్, గంట బుచ్చ గౌడ్ ,దండు శ్రీనివాస్, గుండా టి రామ్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, శెట్టిపల్లి బాలయ్య, సిరిసిల్ల సురేష్, ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు
