రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజుస్కూల్ ఆవరణంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ సాంప్రదాయ పద్ధతులతో చిన్నారులు ఆమెకు వేద మంత్రములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
