దూల్మిట్ట చేర్యాల కొమురవెల్లి మద్దూరు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమావేశం
సెప్టెంబర్ 27
సిద్దిపేట జిల్లా చేర్యాల; ఈరోజు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య చేర్యాలలో అందరు వికలాంగుల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి వికలాంగుల సమస్యపై చర్చించాడు. తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ చేర్యాలకు సంబంధించిన నాలుగు మండలాలు కొమురవెల్లి చేర్యాల దూలిమిట్ట మద్దూరు గ్రామస్తుల వికలాంగులంతా ఏకమై వికలాంగుల సమస్యను ఎవరో పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎనిమిది తారీకు ఆదివారం మళ్లీ జరిగే సమావేశంలో అందరు వికలాంగులంతా ఏకమై సమావేశానికి హాజరుకావాలని
ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య , జిల్లా అధ్యక్షుడు ఆరగొండ మల్లేశం, రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్, కొమురవెల్లి మండల అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వడ్లూరి కనకయ్య, దూల్మిట్ట మండలం తమ్మిడి రాజు, ఉపాధ్యక్షుడు నరసింహులు, మద్దూరు మండలం ఎర్ర బత్తుల భాను, ఉపాధ్యక్షుడు మల్లారపు రాజు, తుమ్మలపల్లి అనిల్, అందే సాగర్ గ్రామ అధ్యక్షుడు దొడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
