Breaking News

యువకుడి కిడ్నాప్..హత్య

3,619 Views

(మానకొండూర్ మే 28)

యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చితకకబాది, కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన మానకొండూరు మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి (20 )అనే యువకుడిని మంగళవారం ఊటూరు గ్రామంలోని శివాలయం వద్ద తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చితకబాదారు . వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ప్రశాంత్ రెడ్డి ప్రక్కన ఉన్న పాడుబడిన బావిలో దూకాడు. అయినా వదిలి పెట్టకుండా బావిలో నుండి ప్రశాంత్ ను బయటకు తీసి, కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, మానకొండూరు సిఐ మాదాసు రాజకుమార్ గ్రామానికి చేరుకొని, జరిగిన సంఘటన విషయమై పరిశీలించారు.గ్రామాలలోని సీసీ కెమెరా పుట్టేజిని పరిశీలించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు రామవ్వ,రఘునాథరెడ్డిలు దాదాపు పది సంవత్సరాల క్రితమే మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. అతనికి సోదరుడు ఉన్నాడు. మృతునికి తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉండడంతో దాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సిఐ రాజ్ కుమార్ తెలిపారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్