రాజకీయం

వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

104 Views

(తిమ్మాపూర్ మే 09)

బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో బిఎన్ రమేష్ కుమార్, మాదిగ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు..

వారు మాట్లాడుతూ కెసిఆర్ గత ప్రభుత్వంలో దళితుల అభివృద్ధికై దళిత బంధు పథకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, దళితుల అభివృద్ధికి ఎంతో దువ్వదపడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు..

అలాగే మత తత్వ పార్టీ అయిన బిజెపి రిజర్వేషన్లు తీసేసే కుట్ర జరుపుతుందని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసేసే కుట్రలు జరుపుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం, 6 గ్యారంటీ పథకాలను, అమలు చేయకపోవడం, ఇలా దళితులకు మొండి చేయి చూపెట్ట ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు.మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ని గెలిపించుకుంటే కరీంనగర్ అభివృద్ధి చేసి చూపిస్తాడని కారు గుర్తుకే ఓటేసి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను వేడుకున్నారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, అక్కపాక శశి మాదిగ, వి. నరేష్ మాదిగ, కే. అరుణ్ మాదిగ, ఏం. రాజు మాదిగ, ఆర్. శ్రీనివాస్ మాదిగ, కే. వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298