రాజకీయం

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు..

340 Views

(తిమ్మాపూర్ మే 08)

తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బండారి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు. ఖమ్మం తిరుపతి, దొబ్బల కుమార్, దొబ్బల అశోక్, దొబ్బల సురేష్, ఖమ్మం అశోక్, ఖమ్మం హరీష్, ఖమ్మం సంపత్, నెల్లి రవి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు..

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోరపల్లి రమణా రెడ్డి, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్, డీసీసీ ఆఫీసు ఇంచార్జ్ గోపు మల్లరెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నబోయిన రవి, గ్రామ శాఖ అధ్యక్షులు గుంటి మల్లేశం,సీనియర్ నాయకులు కనకం కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎండీ ఆశీక్ పాషా, ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కనకం రాజేందర్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి అంకూస్ నాయకులు దొబ్బల శేఖర్, బుడిగే మోహన్,పడాల అనిల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్