బీఆర్ఎస్ కే పట్టం కట్టాలి-ఎంపీపీ పాండుగౌడ్
కెసిఆర్ దత్తత గ్రామంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మే 1)
కేవలం నాలుగు మాసాల పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో తెలిసిపోయిందని ఎంపీపీ పండు గౌడ్ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం అన్నారు. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మర్కుక్ మండలం మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామంలో మరియు గ్రామ ఉపాధి హామీ పథకం కార్యక్రమం వద్ద ప్రజలకు బిఆర్ఎస్ కరపత్రాలు పంచుతూ మంగళవారం రోజున పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఎంపీపీ పండు గౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ బిఆర్ఎస్ అభ్యర్థి కి అఖండమైన మెజారిటీని ఇచ్చి అద్వితీయమైన గెలుపును సొంతం చేసి ఢిల్లీకి పంపి మన గల్లీలో పనులను సులువుగా చేసుకోవడానికి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ తన రాజకీయ జీవితాన్ని మెదక్ ప్రజలకు అంకితం చేసే భావం కలిగి ఉన్నా వెంకటరామిరెడ్డిని గెలిపించాలని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటు వేసి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, కేసీఆర్ తెలంగాణ ప్రజల కేంద్రంగా పనిచేస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసి ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ నాచారం దేవాలయ చైర్మన్ హరి పంతులు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మ్యకల కనకయ్య ముదిరాజ్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజు తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ లక్కాకుల నరేష్, మాజీ వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ వెంకటయ్యయాదవ్ ,మాజీ ఉపసర్పంచ్ కనకయ్యయాదవ్ మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగ్రీసు మల్లేశం, సినియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, పర్శరాములు, నర్సింహా రెడ్డి, జంగులు యాదవ్, కుంట యాదగిరి,,బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
