రాజకీయం

మానకొండూర్ అభివృద్ధి శూన్యం

364 Views

–పథకాల ఆశజూపి మభ్యపెడుతున్నారు.

–మాజీ ఎమ్మెల్యే,బిజెపి నాయకులు ఆరెపల్లి మోహన్.

(తిమ్మాపూర్ అక్టోబర్ 21)

బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి పాలనలో మానకొండూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.శనివారం తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, మొగిలిపాలెం తదితర గ్రామాల్లోని పర్యటించారు.వివిధ పార్టీలకు ముఖ్య నాయకులతో, బీజేపీ కార్యకర్తలతో ఆరెపల్లి సమావేశమయ్యారు. అనంతరం తిమ్మాపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం నేదునూర్ లో పవర్ ప్రాజెక్ట్ కోసం వివిధ వర్గాలకు చెందిన ప్రజలనుండి సేకరణ చేసిన సుమారు 500 ఎకరాల భూముల గురించి గానీ సంబంధిత ప్రాజెక్టు గురించి గానీ, రామక్రిష్ణకాలనీ లో నిరుపేద రైతుల నుండి సేకరించిన భూములను వ్యాపార పరంగా వినియోగించవద్దని అసెంబ్లీ లో ఎప్పుడైనా మాట్లాడినావా అంటూ ఎమ్మెల్యే ను పత్రికా ముఖంగా ప్రశ్నించారు.రామక్రిష్ణకాలనీ లో సుమారు 100 ఎకరాల భూములను ఎక్కువ ధరలకు అమ్ముకున్నప్పుడు వాటిపై వచ్చిన లాభాలను భూయజమానులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు.గృహలక్ష్మి, దళిత బందు, బీసీ బందు లాంటి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబందించిన ప్రొసీడింగ్స్ ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదని అడిగారు.ఎదో ఒక పథకం ఇస్తామని ఆశజూపి ప్రజలను బిఆర్ఎస్ నాయకులు మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

గతంలో నేను చేసిన పనులే తప్ప వేరే కొత్త పనులు లేవని ప్రజలే గుర్తు చేస్తున్నారని అన్నారు.బీజేపీ రాష్ట్ర పార్టీ ఆశీస్సుల మేరకు బీజేపీ తరపున తాను ఎమ్మెల్యే అభ్యర్థి గా ఉంటాననే విషయాన్ని ప్రజలకు తెలిపినప్పుడు వారంతా తనకు పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటామని పేర్కొన్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే రసమయి దురుసు ప్రవర్తన వల్ల నియోజకవర్గంలోని అన్నీ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇటు కవ్వంపల్లి సత్యనారాయణ గావొచ్చు, రసమయి బాలకిషన్ తో కావొచ్చు దళితులకు ఎటువంటి న్యాయం జరగదని అన్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి, మాజీ ఎంపీటీసి తోడేంగ కొమురయ్య,కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్,సీనియర్ నాయకులు చింతం శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,మామిడి రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *