రాజకీయం

మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఇంటింటి ప్రచారం

81 Views

మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఇంటింటి ప్రచారం

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ (మే 1)

మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మర్కుక్ మండలం మాజీ సీఎం కెసిఆర్ దత్తత గ్రామంఎర్రవల్లి లో మండల ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి ఎంపీపీ పాండుగౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కరపత్రాలు పంచుతూ మంగళవారం రోజున పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాం చంద్రం మాట్లాడుతూ నాడు కలెక్టర్ గా జిల్లాను దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన ఐఏఎస్ అధికారిగా నిష్పక్షపాతంగా , నేడు మనకు మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థిగా లభించినందుకు అఖండమైన మెజారిటీని ఇచ్చి అద్వితీయమైన గెలుపును సొంతం చేసి ఢిల్లీకి పంపి మన గల్లీలో పనులను సులువుగా చేసుకుంటానికి ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ తన రాజకీయ జీవితాన్ని మెదక్ పార్లమెంట్ ప్రజలకు అంకితం చేస్తాడు కావున మనందరం వెంకట్రామిరెడ్డి గెలిపించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ మేడలు వంచాలంటే బి ఆర్ ఎస్ పార్టీ గెలవాలని, కెసిఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మేడలు వంచి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తామని అమలు చేయకుండా కాలయాపన చేస్తుందిఅన్నారు. బిజెపి పార్టీ దేవిని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ నాచారం దేవాలయ చైర్మన్ హరి పంతులు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మ్యకల కనకయ్యముదిరాజ్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజు తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ లక్కాకుల నరేష్, మాజీ వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ వెంకటయ్యయాదవ్ ,మాజీ ఉపసర్పంచ్ కనకయ్యయాదవ్ మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగ్రీసు మల్లేశం, సినియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, పర్శరాములు, నర్సింహా రెడ్డి, జంగులు యాదవ్, కుంట యాదగిరి,,బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్