విద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.అలాగే విద్యాసాగర్ రెడ్డి చేస్తున్న నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను చూసి అభినందించారు. ఇంకా రాజకీయంగా ఎదిగి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల మన్ననలను పొందుతూ ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
