రాజకీయం

చేబర్తి గ్రామంలో కార్మిక దినోత్సవ వేడుకలు

65 Views

చేబర్తి గ్రామంలో కార్మిక దినోత్సవ వేడుకలు

కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు తోట గణేష్ జెండా ఎగరవేయడం జరిగింది . కార్మిక సంఘంతో కలిసి ఆయన మాట్లాడుతూ బి ఆర్ కూలీలు తెలంగాణకు రావడం వలన తెలంగాణ కూలీలకు పని దొరకడం లేదని అన్నారు. ప్రభుత్వం గమనించి తెలంగాణ కూలీలకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీహార్ కూలీలను తెలంగాణకు రానివ్వద్దని డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువన నిర్మాణ కార్మిక అధ్యక్షులు తోట గణేష్,మాజీ అధ్యక్షుడు తోట లక్ష్మణ్,
ఉపాధ్యక్షులు చెమ్మని ప్రభాకర్, తోట నాగరాజ్,
ప్రధాన కార్యదర్శి గుర్రాల బాలరాజ్,కోశాధికారి కొంతం కనకయ్య,కార్యదర్శి కోటయ్య ,
భవన నిర్మాణ సంఘం సభ్యులు, హరిబాబు, యాదగిరి, కనకయ్య,మల్లేశం,నారాయణ,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్