రాజకీయం

మెదక్ లో గులాబీ జెండా ఎగుర వేస్తాం

63 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 27)

వెంకట్రాంరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు.

గజ్వేల్ : రాబోయే ఎంపి ఎన్నికల్లో మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ కంచుకోట అని నిరూపిస్తామని గజ్వేల్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.
శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ గడ్డమీద వెంకట్రాo రెడ్డి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు.
రాజీలేని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు గత పదేళ్లలో తెలంగాణ ఖ్యాతిని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపే దిశలో అన్ని రంగాల్లో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడిపిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహ కారం అందించకున్నా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలంగాణలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కెసిఆర్ కొనసాగించి ఒక బలమైన ఆర్థిక
సామాజిక పునాదిని రాష్ట్రానికి వే శారని తెలిపారు. కానీ నేడు రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ కక్షసాధింపులతోనే కాలం గడుపుతూ పాలనను గాలికొదిలే సిందని విమర్శించారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం రైతును, వ్యవసాయాన్ని ప్రథమ ప్రా ధాన్యతగా తీసుకొని పని చేసి పంట ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకువస్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు కరెంట్ అటు సాగునీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ముందుచూపు పట్టింపులేని కారణంగా కరువు పరిస్థితులు అలుముకున్నాయని ఎద్దేవా చేశారు.100 అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వంద రోజులు ఆరు గ్యారెంటీ అమలు చేస్తామని బ్యాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన మోసం వదలకు బోనస్ ఇస్తామని చెప్పి నేడు కోడ్ వచ్చిందని మాయమాటలు చెబుతున్నారు అన్నారు. నాడు కెసిఆర్ ఉన్నప్పుడు కరెంటు ఉన్నదా అని మోటార్లు కాలిపోతున్నాయని ట్రాన్స్ఫార్మర్లు వెళుతున్నాయి అన్నారు. ఎక్కువ పింఛన్ ఇవ్వకపోగా జనవరి నెల పింఛన్ ఏ కొట్టిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూ.లతో పాటు తులం బంగారం. 500 రూ.లకే..గ్యాస్ సిలిండర్. 2 లక్షలు రుణ మాఫీ. చేస్తామని చెప్పి ఇవ్వలేదు అన్నారు.
కాంగ్రెస్ అడుగుపెట్టగానే కరువు వచ్చిందన్నారు.
ఒక్క ఉద్యోగ పరీక్ష నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు..ఇంటింటికిమంచి నీళ్ళు ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఇచ్చింది, చెరువు కుంటలు బాగు చేయడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా ద్వారా రైతులను అదుకున్నది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు ..మొన్న ఎన్నికల్లో కొద్దిలో ఓడి పోయామని, నేడు బదులు తీర్చు కోవలన్నారు…
జూటా మాటల రఘునందన్ కు బుద్ది చెప్పాలన్నారు. ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఎడ్లు బండి, నిరుద్యోగ భృతి, ఫించన్లు, రైలు బండి తెస్తా నని మోసం చేశాడని, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనని చిత్తుగా ఓడించారన్నారు..కేసీఆర్ కన్నా భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని, యాదగిరి గుట్ట బ్రహ్మాండంగా నిర్మించుకోలేదా అని ఆయన తెలిపారు.. దేవుని మీద రాజకీయాలు బీజేపీ వాళ్లు చేస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు..11 ఏళ్ళు జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి సేవలు వినియోగించుకోవలన్నారు..100 కోట్ల ట్రస్టుతో యువత, మహిళ లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రారామిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు..

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్