ప్రాంతీయం

సిర్పూర్ లో వీర హనుమాన్ శోభాయాత్ర

104 Views

కొమరం భీం జిల్లా

*హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*

*కాగజ్ నగర్ :* పట్టణంలోని పాత హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని రామాంజనేయులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అయోధ్య రాముల తరహా నమూనా విగ్రహానికి హారతినిచ్చారు.

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైందవ సంస్కృతి పరిరక్షణ కోసం బజరంగ్ దళ్ విశేష కృషి చేస్తుందని, వారి సేవలు భారతజాతికి ఎంతో అవసరమని తెలిపారు.*

అంతకు ముందు హనుమాన్ శోభాయాత్రకు విచ్చేసిన భక్తులకు జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found