–దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే.
–రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు.
(తిమ్మాపూర్ ఏప్రిల్ 22)
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ పడుతుతున్నటువంటి అభ్యర్థులు,రాజేందర్ రావ్,వినోద్ కుమార్ రాజకీయ పురావాసం కోరేటువంటి అవకాశవాదులేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు ఆరోపించారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీలతో సోమవారం మండల కేంద్రం లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైంటువంటి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ కి ఆదరణ లేదని కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏనాడైనా ప్రజాక్షేత్రం తో సంబంధం ఉందా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా మోదీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత బీజేపీ కార్యకర్తలదేనని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. గతంలో కంటే రెట్టింపు మెజారిటీ తో బండి సంజయ్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్,బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యవర్గ సభ్యులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, శక్తి కేంద్ర ఇంచార్జిలు పాల్గొన్నారు.




