ఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్:పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథలను ప్రారంభించిన బి ఆర్ ఎస్ నాయకులు.
ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం అదిలాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచార రథం ని ప్రారంభించిన ఉట్నూర్ మండలం ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్ ఉట్నూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కందుకురి రమేష్ మరియు ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ ఎండీ సలీం ఉద్దీన్, మరియు సుఫియన్ పుష్ప రాణి దూట మహేందర్ సోనేరావు కామేరి రాజు హైమద్ అజ్జు శ్రీకాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జైవంత్ రావు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తెలంగాణకు కెసిఆర్ రక్షణ అని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేద్దామని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




