పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు
ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడుతూ…
ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి..
పది సంవత్సరాలు అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపింది కేసీఆర్..
కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు కాకముందే వ్యవసాయం చిన్నబిన్నం అయింది, పంటలు ఎండిపోయి 200 మంది రైతులు, ఫ్రీ బస్సు తో ఆటో డ్రైవరన్నలు 50 మంది చనిపోయారు అని అంటే ఎక్కడ అని స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నాడు.
పొలాలకు నీళ్ళు ఇవ్వక 20 లక్షల ఎకరాలను పంటలను ఎండిపోయినందుకా, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అని నోటిఫికేషన్ ఇవ్వనందుకా, టెట్ దరఖాస్తుకు 200 రూపాయల ఫీజు ను 1000 రూపాయలు పెంచినందుకా..
నిరుద్యోగ భృతి ఇవ్వానందుకా, 4 వేల ఫించన్ ఇవ్వనందుకా ఈ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలా..
డిసెంబర్ 9 తేదీన రుణమాఫీ చేస్తా అన్నారు.. ఇప్పుడు ఆగస్టు 15 తేదీన రుణమాఫీ చేస్తా అంటున్నారు.
రైతు బంధు కు 7500 కోట్ల రూపాయలు ఎటు పోయినై
రైతు బీమా పథకాలను కోనసాగిస్తారా విషయం చెప్పడం లేదు..
కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు ఉంది..
ప్రశ్నిస్తే దౌర్జన్యం గా బిఆర్ ఎస్ కేసులు కార్యకర్తలపై కేసులు.. 10 సంవత్సరాల కెసిఆర్ గారి పాలనలో ఎక్కడైన ఇలా జరిగిందా….
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధనకు 48 రోజులు నిరసనలు దీక్షలు చేపట్టారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే వేల మంది కార్మికులకు ఇల్ల స్థలాలు, 10 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను కల్పించారు.
ఇది కాకుండా సింగరేణి కార్మికులకు అదనపు సౌకర్యాలు కల్పించింది కెసిఆర్ గారు
మొదటి సారి గా 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఈ ప్రాంత వ్యక్తి గా అవకాశం కల్పించినట్లైతే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కావచ్చు, సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుంది.
ఇక్కడ ఓ కార్పోరేట్ అభ్యర్థి వస్తున్నాడు. వాళ్ళు కార్పోరేట్ వ్యవస్థ నుంచి వచ్చినవారు,, వాళ్ళకు కార్మికులు, భాదలు, వ్యవసాయ రైతు భాదలు ఏం తెలుస్తాయి..
పార్లమెంటు నియోజకవర్గ స్థాయి 4 రిజర్వాయర్ సీట్లు ఉంటే అందులో 3 ఒకే కుటుంబానికేనా..
అదేవిధంగా ఇక్కడ గెలిచిన వారు చుట్టపు చూపుగా వచ్చిపోయే సంప్రదాయాన్ని చూస్తున్నాము, కాని స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజల అందుబాటులో ఉన్న తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు..




