కామారెడ్డి బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మరియు ఆయనకు వంత పాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిద్దరికి భజన చేస్తున్న బీజేపీ అంధ భక్తులు ఏదైతే గజ్వేల్ బస్టాండ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారో ఆ బస్టాండ్ ఏదైతే ఉందొ అది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ ప్రాంతం .. గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న శిథిలావస్థకు చేరిన, ఇరుకు రోడ్డులు గల ,ప్రయాణీకులకు ట్రాఫిక్ ఇబ్బందులు గమనించిన కెసిఆర్ గారు , అక్కడున్న బస్టాండ్ భవనాన్నీ తొలగించి అక్కడ ప్రజల అందరికి దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక హంగులతో ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి ని నిర్మిస్తున్నారు … తొలగించిన బస్టాండ్ ను ట్రాఫిక్ సమస్యలు లేని, ప్రజ్ఞాపూర్ రోడ్డులో నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి … అప్పటివరకు ప్రయాణీకులకు ఇబ్బంది కల్గకుండా తాత్కాలికంగా పాత బస్టాండ్ రేకుల షెడ్డు నిర్మాణంలో బస్టాండ్ ప్రాంతాన్ని కొనసాగిస్తుంటే గజ్వేల్ అభివృద్ధిని చూసి కళ్ళు మండుతున్న బీజేపీ నాయకులూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు…
గజ్వల్ నుండి పసి పిల్లలు అనారోగ్య సమస్యల దృష్ట్యా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్లి,కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గజ్వేల్ నియోజక వర్గ ప్రజలందరికి అందుబాటులో ఉండేలా బస్టాండ్ భవనాన్ని కూల్చేసి పట్టణం మధ్యలో పసి పిల్లల కోసం ఉచితంగా వైద్య సేవలు అందించుటకు ఆసుపత్రి నిర్మిస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేని కళ్ళు లేని కామారెడ్డి బీజేపీ నాయకులు మరియు రాష్ట్ర బీజేపీ నాయకులూ పనికిమాలిన,పసలేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటు ….
మీకు నిజంగా …….ల దమ్ముంటే ప్రజ్ఞాపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నూతన బస్టాండ్ ను చూపించండి.. అదే పాత బస్టాండ్ పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని చూపెట్టండి… దానికి కొద్దీ ముందరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ని చూపేట్టండి.. దానికి వెనకాల ఉన్న మెట్రాజ్ పల్లి రోడ్డులో గల మహతి ( కళా భారతి) ఆడిటోరియం , అదే రోడ్డులో గజ్వేల్ మున్సిపాలిటీ భవనం, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ భవనం కూడా చుపెట్టండి … ఇవన్నీ చూసి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి పోయి అక్కడ జరిగిన జరుగుతున్న అభివృద్ధిని మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని పోల్చి చుపెట్టండి …
