రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు మున్నూరు శ్వేత కాపు సంఘం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నూరు శ్వేత కాపు సంఘం అధ్యక్షుడు మేగి దేవయ్యతోపాటు దుమాల మాజీ సర్పంచ్ కదిరి వెంకట శ్రీనివాస్ గౌడ్ రాగట్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి మహేందర్ తో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వీరిని ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం లో గత పది సంవత్సరాల నుండి ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందన్నారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని హైదరాబాదులో కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని బిఆర్ఎస్ ప్రభుత్వం పొలం బాట పట్టడం విడ్డూరంగా ఉందన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పొలాలు పట్టుకొని తిరగడం చేతకానితనంగా భావిస్తున్నామన్నారు. వడగండ్ల వాన వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బిఆర్ఎస్ నాయకులు ఇంకా విమర్శించడం వాళ్ల అవివేకానికి నిదర్శనం అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటుతుందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తన ఎమ్మెల్యే ఎన్నిక కోసం డబ్బులు పంచనని మందు పంచనని శపథం చేయగా ఫోన్ టాపింగ్ లో సాక్షాత్తు ఇంటెలిజెన్స్ అధికారి పోలీస్ వాహనాలలో డబ్బులు సరఫరా చేశామని ఒప్పుకోవడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి ,నాయకులు చెన్నిబాబు, గంట బుచ్చగౌడ్, అనవేని రవి,సుధాకర్ గౌడ్, మర్రి శ్రీనివాసరెడ్డి,కొత్తపల్లి దేవయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.




