మహబూబ్ బాద్ లో సెంకండ్ ఏఎన్ఎం చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
ఆయన మాట్లాడుతూ..సమస్యలున్నప్పుడు సమ్మెలుంటాయి.
కానీ కెసిఆర్ నా రాజ్యంలో ఎవరు సమ్మెలు చెయ్యొద్దు అంటారు.
సంఘాలు ఉండొద్దు అంటూ హుకుం జారీ చేశారు.
తెలంగాణ వచ్చాక మొదట 1700 మంది పేద మున్సిపల్ కార్మికులను తీసివేసి తన కర్కశాన్ని కెసిఆర్ ప్రదర్శించారు.
చైతన్యం ఉండవద్దు అంటూ ధర్నా చౌక్ ఎత్తివేశారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే భగవంతుడు కూడా కాపాడలేడు అని వారినీ హింసపెట్టి 39 మంది చావుకు కారణం అయ్యారు.
vra vro గ్రామ కార్యదర్శుల సమ్మె చేస్తే వారి కుటుంబ సభ్యులను బెదిరించారు.
సమ్మేళను ఉక్కు పాదంతో అనిచివేసారు.
సెకెండ్ ANM రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ప్రకారం ఎంపికచేయబడుతుంది.
కాంట్రాక్ట్ అనే పదం ఔట్ సోర్సింగ్ అనే పదం ఉండదు అన్న కెసిఆర్ 10 ఏళ్లుగా అదే కొనసాగిస్తున్నారు.
మనిషి ప్రేమకు అంతస్థులో సంబంధం ఉండదు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు కనిపించిన అమ్మ నాన్నలను, కన్నబిడ్డను చూసుకోలేక పోతున్నారు.
23 ఏళ్లుగా పని చేస్తున్న ANM లను ఇవ్వాళ తీసివేయడం సరి కాదు. వీరిని పర్మినెంట్ చేయండి.
వీరికి పరీక్ష పెడతావా ? వీళ్ళ ఉసురు పోసుకుంటావా? వీళ్లని తీసివేస్తావా?
అది కరెక్ట్ కాదు.
మంచి ప్రభుత్వం రాక పోతుందా మా మీద దయ చూపించక పోతారా అని కనిపించారు.
వైద్య ఆరోగ్య శాఖ మనిషులతో జరిపే డిపార్ట్మెంట్ కంప్యూటర్ తో పనిచేయదు.
మా వాళ్ళు పర్మినెంట్ చేయమని అడుగుతున్నారు.
నీ సంపదలో వాటా అడగడం లేదు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వద్దు.
మీకు ఓట్లు వేసింది మమ్ముల్ని ఇలా ఇబ్బంది పెట్టడానికి కాదు.
వీరి ధర్నాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– ఈటల రాజేందర్
ఎమ్మెల్యే హుజూరాబాద్
బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్.





