Breaking News

ఘనంగా పూలే జయంతి వేడుకలు

153 Views

ఆదర్శనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే

ఘనంగా పూలే జయంతి వేడుకలు

సంగారెడ్డి ఏప్రిల్ 11

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామములో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నిర్వహించారు.మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ..అంటరానితనంకుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్