మీ రక్షణ మా బాధ్యత
ఏప్రిల్ 10 సంగారెడ్డి జిల్లా,జహీరాబాద్ నియోజకవర్గం
ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ పోలీసులు, పై అధికారుల ఆదేశాల మేరకు, ఆయా గ్రామాలలోని చెరువులలో, బండరాళ్లు, బురద, మరియు నీళ్లు లోతుగా ఉన్నందున, విద్యార్థులు, పశువుల కాపారులు,మరియు జాలారులు, చెరువులోకి వెళ్లకూడదన్నారు. ప్రజల ప్రాణ రక్షణ కొరకు, చెరువులో ఈత ఆడకూడదని, పడవ ప్రయాణం చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని,ఝరాసంగం పోలీసులు ప్రజలను హెచ్చరించడం జరిగింది.





