యువత భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు
అక్టోబర్ 20 మెదక్
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన యువత గ్రామ సర్పంచ్ పద్మా వెంకట్, మరియు యాద గౌడ్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తనయుడు యువ నాయకుడు పునీత్ రెడ్డిబిఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల రాజయ్య, యూత్ నాయకులు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ చదర రాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు కావేరి సిద్ధిరాములు, బండి భూషణం, బోయిని చిత్తారి, వార్డు మెంబర్ కావేరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
