-ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకు లో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ,
అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు
మీ పిల్లలను బ్యాంకు కు తీసుకురావడమేంటాని ఖాతాదారులు ప్రశ్నిస్తే మా ఇష్టం మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు,
అంతేకాకుండా బ్యాంక్ లోన్ల కోసం తమ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డులను కానీ , నో డ్యూ సర్టిఫికెట్లను గానీ అవసరం ఉందని అడుగుతే జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆన్లైన్లో అప్లై తీసుకోండి అని సమాధానం చెబుతూ దాట వేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా కస్టమర్లకు అందుబాటులో ఉండాల్సిన ఉద్యోగులు అందుబాటులో లేకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని ఖాతాదారుల కళ్లెదుటే బ్యాంకు ఉద్యోగులు తమ పిల్లలతో బ్యాంకు కు సంబంధించిన ఫామ్స్ లపై వెర్రీ రాతలు రాయిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని,
దీనిని బ్యాంకుకు సంబంధించిన ఉన్నత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ఆ బ్యాంకులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బ్యాంకు ఉద్యోగులపై చర్య తీసుకోవాలని రాచర్ల బొప్పాపూర్ యూనియన్ బ్యాంక్ కస్టమర్లు వాపోతున్నారు,
ఈ విషయం పై బ్యాంకు మేనేజర్ శ్రావన్ ను వివరణ అడుగగా తన ఆరోగ్యం రీత్యా సెలవులో ఉన్నానంటూ ఆ విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు,
