వర్గల్ మండలములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించి మంగళవారం రోజున జరిగే ఆరోగ్య మహిళా క్లినిక్ నందు మహిళలను పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మరియు ల్యాబ్ టెస్టుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది. ఆరోగ్య మహిళలకు ప్రత్యేక సేవలను గురించి వివరించడం జరిగింది. మరియు ఆస్పత్రి భవన నిర్మాణం గురించి కూడా చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంనకు ఎంపీపీ జాలిగామ లత ,ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రజిని, డిప్యూటీ డిఎంహెచ్ఓ ,డాక్టర్ శ్రీనివాస్ , ఎంపీడీవో మేరీ స్వర్ణ కుమారి మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
