ఆధ్యాత్మికం

‘రాజరాజేశ్వరి’ సన్నిధిలో మంత్రి పూజలు..

263 Views

(తిమ్మాపూర్, డిసెంబర్ 27)

తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదం అందజేశారు.

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ…

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని ఆ రాజరాజేశ్వరి దేవికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని, ప్రజాకాంక్షతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేందుకు తగిన బలాన్ని ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు..

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బండారి రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, మండల కో ఆప్షన్ తాజొద్దిన్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, గవ్వ రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి నరేందర్ రెడ్డి, డీసీసీ ఆఫీస్ ఇంఛార్జి గోపు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు ఎస్ కే సాజిద్, 8వ డివిజన్ ప్రెసిడెంట్ తమ్మనవేణి రమేష్ యాదవ్, నాయకులు బుదారపు శ్రీనివాస్, శ్రీగిరి రంగారావు, జాప ప్రశాంత్ రెడ్డి, కుంబాల లింగయ్య, ముంజ శ్రీకాంత్, తొర్తి అరవింద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *