సిద్దిపేట జిల్లా తెలుగు న్యూస్ ప్రతినిధి
జగదేవపూర్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన
ఘటన జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే తిరుపతి బార్య కనకవ్వ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది.దీంతో ఇంట్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కనకవ్వ .కూతురు అశ్విని కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో రూ.20 వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపారు.
