Breaking News

ఉద్యోగులను డోఖా చేసిన కాంగ్రెస్ సర్కార్..

71 Views

గజ్వేల్ ఏప్రిల్ 5, 24/7 తెలుగు న్యూస్ :ఉద్యోగులను డోఖా చేసిన కాంగ్రెస్ సర్కార్

మైనార్టీ లపై శీతకన్నెలా…?

1వ తేదీన జీతాలు ఏమయ్యాయి…?

మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు..ఫైర్.

గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అబద్ధాలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.. గజ్వెల్ లో మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి మాట్లాడారు..ప్రభుత్వం లోకి రాగానే పెండింగ్ లో ఉన్న
ఉపాధ్యాయ, ఉద్యోగులకు 3 డీఏ లు విడుదల చేస్తామన్నారని, 100 రోజులు గడిచినా విడుదల చేయలేదని, మూడుకు తోడు నాలుగు బకాయిలు పెండింగ్ పడ్డాయన్నారు..100 రోజులు నిద్ర పోయినట్లు, నేడు అన్నిటికీ ఎన్నికల కోడ్ అని దాట వేస్తున్నారని, చిత్త శుద్ధి ఉంటే ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకొని విడుదల చేయాలన్నారు..
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారని, ..కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగిందని గుర్తు చేశారు
పదవి విరమణ వారికి సైతం బెనిఫిట్స్ ఇవ్వాలంటే, బండ్లు ఇచ్చి 3 ఏళ్ల తర్వాత చెల్లిస్తామని లీఖులు ఇస్తున్నారన్నారు..విరమణ చేస్తే వొచ్చే ఆదాయంతో ఎదో ఒక ప్రయోజనం కోసం వారు ప్లాన్ చేసుకుంటారని, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతుందన్నారు…..ఉద్యోగుల మీద ఏసీబీ, విజిలెన్స్ రైడ్స్ పెరుగుతున్నాయని, .వారిని విపరీతంగా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు… ప్రభుత్వం పీఆర్సీ మీద నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లో రెండు మార్లు 73శాతం పీఆర్సీ ఇవ్వడం జరిగిందన్నారు…. మీరు కూడా మెరుగైన పి ఆర్ సి ఇవ్వాలని డిమాండ్ చేశారు….గొల్ల కుర్మలకు 100 రోజులు గడిచినా గొర్రెలు ఇవ్వడం లేదు, వారు కట్టిన డిడి లు అయినా ఇవ్వడం లేదన్నారు…ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత గొర్రెల పంపిణీ చెయాలన్నారు..ముస్లీం లకు పెద్ద పీఠ వేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ నాయకులు, నేడు క్యాబినెట్ లో ఒక్క ముస్లిం లకు కూడా అవకాశం ఇవ్వలేదని, డోఖా చేశారన్నారు, ..ముస్లిం మైనారిటీలకు వక్ఫ్ కు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని డోఖా చేశారని, మైనారిటీ గురుకులాలకు నిధులు విడుదల చేయకపోవడంతో మూత పడే అవకాశాలు ఉన్నాయన్నారు….ఇమాం, మొజాం లకు బీఆర్ఎస్ ప్రభుత్వం 5వేల వేతనం అందించగా, వారికి 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు…..నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లో మైనారిటీ లకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా తోపా, బట్టలు పంపిణీ చేసే వారమని, ..నేడు రంజాన్ పండుగ కు తోపా నిలిపివేశారన్నారు .పోలీసు , హోమ్ గార్డు ఉద్యోగుల కు రావాల్సిన రియంబర్స్ మెంట్, ఇతర బెనిఫిట్ లు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలన్నారు…1వ తేదీన వేతనం అందడం లేవు..5వ తేదీ వచ్చినా చాలా మంది ఉద్యోగుల కు వేతనాలు అందలేవన్నారు… కొంత మందికి ఇచ్చి అంత మందికి ఇచ్చి నామని అవాసత్వాలుచెబుతున్నారని పేర్కొన్నారు..

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal