నేరాలు

గోదావరిఖని లో మావోయిస్టు పార్టీ సభ్యుడు అరెస్ట్

278 Views

పెద్దపల్లి జిల్లా:డిసెంబర్ 08
మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తమ ఉనికి ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయ త్నాలలో భాగంగా సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖనికి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ మిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు.

ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. గురువారం ఆర్డరాత్రి గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతిలో సంచితో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తూ పోలీస్ లకు కనిపించినాడు.

అతను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలిసులు అతడిని సమీపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

వెంటనే అప్రమ త్తమైన పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా అతడు సీపీఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా సికాస కార్య కలాపాలను విస్తరించడానికి పార్టీ ఆదేశాలతో గోదావరీఖనికి వచ్చినట్టు అంగీకరించారన్నారు.

నిందితుడు అవినాష్ కొన్ని వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *