తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి)మార్చి 31
*- మార్కెట్ లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి*
*- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి*
మోడల్ మార్కెట్ తో చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని, మార్కెట్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.ఆదివారం డివిజన్ కేంద్రంలోని మోడల్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించారు.కూరగాయల విక్రయ దారులతో మాట్లాడి వ్యాపారం తీరుతెన్నులపై అడిగి తెలుసుకున్నారు. ఆశించిన మేర గిట్టుబాటు కావడం లేదని కూరగాయల అమ్మకం దారులు ఎమ్మెల్యేకు తెలిపారు. మోడల్ మార్కెట్లో నాన్ వెజ్ అమ్మకాలు అతి త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని,దీని పై మున్సిపల్ అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మూత్రశాలలో త్రాగునీరు విద్యుత్ దీపాలు తదితర సమస్యలను విక్రయదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
అనంతరం విక్రయదారుల వద్ద ఎమ్మెల్యే స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….
కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ భవన సముదాయాల ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు. మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం ఒకే దగ్గర అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ ఉండటం గర్వకారణమన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తో
పట్టణ విస్తరణ పట్ల అవగాహన పెంచుకోవాలని భవిష్యత్ తరాలకు సరిపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మార్కెట్ పై భాగములో మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవాలని తద్వారా మున్సిపాలిటీకి ఆదాయవనరులు పెరుగుతాయని సూచించారు.
మార్కెట్ చుట్టూ ప్రహరీ , మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లోని ఏకైక మున్సిపాలిటీ అయిన తొర్రూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అనేక విప్లవాత్మక మార్పులకు పూనుకుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్లు తూనం రోజా ప్రభుదాస్, దొంగరి రేవతి శంకర్, కొలుపుల శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు మల్లేశం గౌడ్, బిక్షం గౌడ్, నల్లపు రాజు, తూనం శ్రావణ్ కుమార్, బిజ్జాల అనిల్, ముద్దసాని సురేష్, ప్రవీణ్ గౌడ్, యూత్ పట్టణ అధ్యక్షుడు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
