కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
ఎల్లారెడ్డిపేట మార్చి 31;
ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు,
అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు,
ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుర్కా జ్యోతి మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్యకు, పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డికి, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఆకుల లతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి, మండలంలోని మహిళలకు ప్రజలకు అవగాహన కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలను ఇవ్వడం పట్ల ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , పట్టణ అధ్యక్షులు చెన్నైకి బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, రవి, సూడిది రాజేందర్, భానోత్ రాజు నాయక్, సాహెబ్ మర్రి , శ్రీనివాస్ రెడ్డి, లింగం గౌడు, దత్తాధ్రి గౌడు, బుచ్చ గౌడు, బండారి బాల్ రెడ్డి , మెండే శ్రీ నివాస్ యాదవ్, గౌస్ బాయి, శ్రీ నివాస్,
గంట ఆంజనేయులు గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, పాల్గొన్నారు.
