24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29)
డోర్నకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో గొల్లచర్ల గ్రామ శివారు కస్నా తండా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాలు నాయక్ ఇంట్లో కస్నా తండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో సమావేశమైన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అములు చేసే హామీలను వివరించాలని కోరారు.అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ని ప్రధాని చెయ్యాలని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగదీష్ నాయక్,రాజ్ పుత్ నాయక్,పఖీర నాయక్,శంకర్ దేవ్ సింగ్,శ్రీను,తేజ్య తదితరులు ఉన్నారు…
