Breaking News

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

61 Views

*సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ*

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు.

 

ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందిం చారు.

కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్ కు చెప్పా అని అన్నారు.

కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారు…

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్