*రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు*
*ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు*.
మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు.
వైద్య సేవల పరిమితి రూ.3 లక్షలు పెంపు
సీఎం ఫొటో.. ప్రభుత్వ లోగోతో కొత్త డిజైన్
క్యూఆర్ కోడ్‌తో కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం
రోగుల నమోదుకు ఫేస్ రికగ్నిషన్ విధానం
వరంగల్ ఎంజీఎంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 19 ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగో, సీఎం కేసీఆర్ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
నిమ్స్ స్పెషల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలి.
బయోమెట్రిక్ విధానంలో ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందుల రీత్యా ఫేస్ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తేవాలి.
ఆన్‌లైన్ పర్యవేక్షణతో మరింత నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అనుమతి.
కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలి.
మూగ, చెవిటి పిల్లలకు హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను వరంగల్ ఎంజీ ఎంలోనూ అందుబాటులోకి తేవాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
