బడుగు బలహీన సంక్షేమం కోసం పోరాడేదే తెలంగాణ ప్రభుత్వం: మంత్రి శ్రీనివాస్ గౌడ్*
మహబూబ్ నగర్:సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం తో పాటు జిల్లాలో సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశమిస్తూ సమాజంలోని బడుగు బలహీన పేదల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రైతుబంధు ,రైతు బీమా, కంటి వెలుగు కేసీఆర్ కిట్ న్యూట్రీషన్ కిట్ అమ్మఒడి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆసరా పెన్షన్లు గొర్రెల పంపిణీ ఉచిత చేప పిల్లల పంపిణీ దళిత బంధు బీసీ లకు ఆర్థిక సహాయం గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని తెలియచేశారు





