ప్రాంతీయం

హోలీ పండుగ శుభాకాంక్షలు రామగుండం పోలీస్ కమిషనరేట్

101 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) శుభాకాంక్షలు తెలియజేశారు.

హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి, రంగులమయం చేయాలని సీపీ గారు ఆకాంక్షించారు.

సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ సంబరాల్లో పాల్గొని పోలీస్ అధికారులకు సిబ్బంది ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ , గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ , జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు , మంచిర్యాల ఏసిపి ఆర్. ప్రకాష్ , ఏ ఆర్ ఎస్ సి పి సురేంద్ర, కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు, రామగుండంకమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found