- . ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో గల అతి పురాతన శ్రీ వేణుగోపాలస్వామి గరుడ సేవ కార్యక్రమం ఘనంగా గ్రామ పాలకవర్గం మరియు ఆలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.దేవతమూర్తుల ఉత్సవ విగ్రహాలను గరుడ సేవ రథం పై ఉంచి ఊరేగించారు.డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపు గా తీసుకెళ్లి హై స్కూల్ వద్ద,నంది విగ్రహం వద్దకు తీసుకెళ్లగా మహిళలు మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ వైద్య నిపుణులు చింతోజు శంకర్ హాజరుకాగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. అదే విధంగా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి ఎస్ .ఐ వి శేఖర్ లను వేదపండితులు ఆశీర్వదించారు. గరుడ సేవ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు అందే సుభాష్ ,ఎంపీటీసీ లు పందిర్ల నాగరాణి,ఎనగందుల అనసూయ,వార్డు సభ్యులు జవ్వాజి లింగం,న్యాలకంటి దేవేందర్, పందిర్ల శ్రీనివాస్ ఆలయకమిటీ చైర్మన్ నంది కిషన్,మేగి నర్సయ్య ,ముత్యాల ప్రభాకర్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట్ నర్సింహారెడ్డి,బీజేపీ నాయకులు గుండాడి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వంగ గిరిధర్ రెడ్డి లతో పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.అదే విదంగా బుధవారం రాత్రి రథోత్సవం ,లడ్డువేలం పాట నిర్వహించనున్నారు.ఈ రథోత్సవం కార్యక్రమంలో సిరిసిల్ల ,కామారెడ్డి,సిద్దిపేట,నిజామాబాద్ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.
