-ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడు
– ఆయనకు టికెట్ ఇచ్చి రైతులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు
– ఉమ్మడి మెదక్ జిల్లాను దోచుకున్న వ్యక్తి
– ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
– పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది
– సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట;
రైతులు వరి వేస్తే ఊరి వేసుకోక తప్పదు అన్నట్లుగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు పి వెంకట్రాంరెడ్డి రైతులను బెదిరించాడని అలా బెదిరించిన వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ హాస్యాస్పదంగా ఉందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఐఏఎస్ వృత్తిలో ఉండి అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో రైతులు వరివేస్తే ఉరి తప్పదని రైతులను హెచ్చరించారని అలాంటి వ్యక్తికి బిఆర్ఎస్ పార్టీ ఎంపి టికెట్ ఇచ్చి రైతులను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో డబుల్ ఇండ్ల పేరిట ఆయన కుటుంబ సభ్యులు కాంటాక్ట్ తీసుకుని నాసిరకమైన ఇళ్లను నిర్మించారని ఆరోపించారు. ప్రాజెక్టులు రిజర్వాయర్ పేరుతో రైతులను బెదిరించి భూ బాధితులను ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల్లో ఆ పాపం అంతా వెంకటరామిరెడ్డి కి తగులుతుందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ చచ్చిన పార్టీ అని ఆ పార్టీకి ఓట్లు వేసిన చెల్లవని అన్నారు. చెప్పాలి మీరే ఎన్నికల్లో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కనీసం సాధిస్తుందని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షులు గాయాజుద్దీన్. నాజ్జు ఫేయాజ్. చోటు ప్రవీణ తదితరులు పాల్గొన్నారు
