మాకు దిక్కెవ్వరు. కట్టుకున్నోడు అనారోగ్యంతో మృతి
ఇద్దరు కుమారులను ఎలా పోషించాలని రోదిస్తున్న తల్లి.
దాతలు ఆర్థిక సహాయం అందించాలని వేడుకో లు.
ఎల్లారెడ్డి పేట మండలంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టి కాషయ్య అలియాస్ రవి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు.
ఆ లుమగల యిన కాషయ్య, రేణుక ల అన్యోన్యదాంప త్యానికి ఇద్దరు కుమారులు శ్రవణ్, సాజీథ్ లు వున్నారు.
శ్రవణ్ పడవ తరగతి చదువుతుండగా వార్షిక పరీక్ష ప్రారంభం నాడే కన్న తండ్రి కాషయ్య అలియాస్ రవి మృతి చెందాడు. పుట్టెడు దుఃఖముతో తండ్రి శవం ఇంట్లో ఉండగానే పదవతరగతి పరీక్ష వ్రాసివచ్చి తండ్రి అంత్యక్రియలు చేయ వలసిన దుస్థితి ఏర్పడ్డది.
ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న పుట్టి కాష య్య అలియాస్ రవి వచ్చే సంపాదనతో భార్య ఇద్దరు పిల్లలని పోషిస్తూ అప్పులు చేసి ఉండడానికి చిన్న ఇల్లు నిర్మించుకోగా డబ్బులు సరిపోక ఇంటి నిర్మాణం కుడా పూర్తి చేయలేక పోయాడు. అంతలోనే అనారోగ్యం బారిన పడ్డ కాషయ్య అలియస్ రవి వైద్యానికి తెలిసిన వరివద్ద భార్య రేణుక అప్పు చేసి వైద్య చికిచ్చ చేయించినా ఫలితం దక్కకుండా పోయింది. ఎలాంటి వ్యవసాయ భూమి లేకుండా వున్న పేద కుటుంభం వారిది.
కుటుంబాన్ని పోషించే ఇంటి యజమాని ఆకస్మాత్తుగా మరణించడంతో ఇద్దరు పిల్లలను ఎలా పోషించేది అని రేణుక రోదిస్తుంది. ఏమి పాలుపోని పరిస్థితి లో దిక్కులు చూస్తూ నీచ్చేస్టు రాలుగా మారింది.
తన ఇద్దరు పిల్ల పోషణ భారంగా మారడం, ఇంటికి, భర్త అనారోగ్యానికి చేసిన అప్పులు తీరే మార్గం కానరాక దాతలు ఆపన్న హస్తం అందించి ఆర్థిక సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతుంది. ఆర్థిక సహాయం చేసే మనసున్న మహారాజులు, మానవతా వా దులు తన ఫోన్ నెంబర్ 8374358410 కు ఫోన్ పే చేసి ఆర్థిక సహాయం అందించి ఆడుకోవాలని పుట్టెడు దుఃఖంతో రేనుక దాతలను కొరింది.
కాగా పుట్టి కాషయ్య అలియాస్ రవి టి ఆర్ ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు కనుక మాజీ మంత్రి కేటీఆర్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య లు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, ఇన్సూరెన్స్ అమౌంట్ ఇప్పించి ఆదుకోవాలని బంధువులు, గ్రామస్థులు, కులస్థులు కోరుతున్నారు.





