ఎల్లారెడ్డిపేట మార్చి 22 ;
ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షులు రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తాజా మాజీ డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు,
ఈ సందర్భంగా కేకే మహేందర్రెడ్డి మెండే శ్రీనివాస్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు,
ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రోజురోజుకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి గా అవినీతిలో కూరుకుపోయిందని. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకత్వం వరకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని అందుకే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు పథకాలు బాగున్నాయని ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ పార్లమెంటరీ సభ్యునిగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ని గెలిపించుకునేందుకు తమ సామాజిక వర్గం నుండి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.
ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు మండే శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు,
ఈ.సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు,
అక్కడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , సీనియర్ నాయకులు మందాటి దేవేందర్ యాదవ్ ఉన్నారు
