ప్రాంతీయం

ఎప్పటికప్పుడు డాటాను సక్రమంగా, సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలి

105 Views

సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు
ఉమ్మడి జిల్లా డాప్ క్యూ డిపిఎం సురేందర్ రెడ్డి సూచన

సిరిసిల్ల:
వైద్య ఆరోగ్యశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలు తీరు, సంఖ్యలను ఎప్పటికప్పుడు డాటాను స, సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సూచించారు.
గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లో గల సమావేశ మందిరంలో కరీంనగర్ పూర్వ ఉమ్మడి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఎం ఎల్ హెచ్ పీ డాక్టర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎం సిబ్బందిలకు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ ఎం ఐ ఎస్), హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన, డాటా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, రోగ నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ కేంద్రాల పనితీరు, సుఖరోగాలు నిర్ధారణ పరీక్షలు, మందులు, వాటి మందుల వివరాలు గర్భిణీ స్త్రీలు, పార్ట్నర్ పరీక్షలు మొదలగు వివరాలను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యక్రమ నిర్వహణ అధికారి కే సురేందర్ రెడ్డి
వివరించారు. హెచ్ ఎం ఐ ఎస్ డాటా సేకరణతో పాటు సకాలంలో సక్రమంగా డాటాను పూర్తి చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీ ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్లు రజిత, శ్రీరాములు, ప్రోగ్రాం అధికారిని డాక్టర్ ఉమా, డీ డీ ఏం కార్తీక్, వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీ డెమో బాలయ్య, ఎన్ హెచ్ ఎం డీఎస్ఓ పద్మయ్య, సీ హెచ్, ఓ సత్యనారాయణ, డాప్ క్యు సూపర్వైజర్ శ్రీనివాస్, ఐ సీ టీ సీ , డీ ఎస్ ఆర్ సీ, మొబైల్ ఐ సీ టీ సీ కౌన్సిలర్స్ కే గంగయ్య, దయాకర్, గాదె రమేష్, టెక్నీషియన్స్ శివ, శ్రీనివాస్, అకౌంటెంట్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7