ప్రాంతీయం

రైతులను అన్నివిధాల కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా…

137 Views

ముస్తాబాద్, మార్చి 19 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని పోతుగల్ బట్టోన్తాల్, సేవల తండా, గన్నవారిపల్లె పలు గ్రామాలలో ఆరుగాలం శ్రమించి పండించిన వరిపంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వడగళ్ల కు వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. చేతికించిన పంట చేజారిపోయిందని రైతులు కంటతడిపెట్టుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నష్టపోయిన రైతులను వారి పొలాల వద్దకు మంగళవారం రోజున పర్యటించి ఏఒక్క రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కలకొడ కిషన్ రావు, అంజన్ రావు, కట్ట బాబురావు, ఈసరి కృష్ణ, ఏ ఈ ఓ వెంకటేష్, సౌమ్య, తదితరులు, రైతులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found