తెలుగు 24/7 న్యూస్(తొర్రూరు ప్రతినిధి)మార్చి 17
తొర్రూరు:మున్సిపాలిటీ పరిధి
ఎరుకల సామాజిక వర్గ అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణమని ఎరుకల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ఎరుకల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శైలజ కృతజ్ఞతలు తెలిపారు.
ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు పేరబోయిన వీరస్వామి తో కలిసిన సందర్భంగా
శైలజ మాట్లాడుతూ….
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా ఎరుకల సామాజిక వర్గం నేటికీ అభివృద్ధి చెందలేదని,కనీస వసతులు లేకుండా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ఎరుకల సమస్యలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అనది కాలంలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాడుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పందుల పెంపకం,బుట్టల అల్లకం ద్వారా వచ్చే అరకొర మొత్తంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఎరుకలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కార్పొరేషన్ కు రూ.500 కోట్లు కేటాయించడంతోపాటు, సామాజిక వర్గ అభివృద్ధికి ప్రత్యేక పథకాలు వర్తింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాగ మల్లయ్య, ఉపాధ్యక్షుడు రాయపురం శ్రీను,మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ సావిత్రి,నాగమణి,మానస, మాదగాని రమ,పెద్ద వంగర,మరిపెడ,కేసముద్రం మండల అధ్యక్షులు మాదగాని వెంకన్న, అంగటి రమేష్, వెంకన్న,మహిళ నాయకులు సాలమ్మ,ముత్తిలింగమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.




